close
Choose your channels

‘RRR’ క్లైమాక్స్‌ చిత్రీకరణ అక్కడే!!

Tuesday, December 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘RRR’ క్లైమాక్స్‌ చిత్రీకరణ అక్కడే!!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘RRR’. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణకు ప్రణాళిక సిద్ధమైంది. వివరాల ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్‌ను వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఇప్పుడు వైజాగ్‌కు ఎన్టీఆర్‌ చేరుకున్నారు. ఎన్టీఆర్‌ వైజాగ్‌లోని ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఆరు రోజుల పాటు ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. ఎన్టీఆర్‌పై ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. పాడేరు సమీపంలో అటవీ ప్రాంతంతో పాటు కాఫీ తోటల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తారని టాక్‌. ఇప్పటికే రాజమౌళి అండ్‌ టీమ్‌ లొకేషన్‌ను చేరుకుంది.

‘RRR’ క్లైమాక్స్‌ చిత్రీకరణ అక్కడే!!ఎన్టీఆర్‌ నైజాం పోరాట యోధుడు కొమురం భీమ్‌గా నటిస్తుంటే.. రామ్‌చరణ్‌ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ చరణ్‌ జోడిగా నటిస్తుంది. కాగా బ్రిటన్‌ నటి ఓలివిలియా మోరిస్‌ ఎన్టీఆర్‌ జోడిగా నటిస్తుంది. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్‌ వంటి హాలీవుడ్‌ తారలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. రూ.400 కోట్లకు పై బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న సినిమా విడుదలవుతుందని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.