close
Choose your channels

చైతు కి సమంత ఫిక్స్...

Saturday, June 4, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌సాహ‌సం శ్వాస‌గా సాగిపో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయ్యింది. ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను ఈనెల 17న‌, చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే నాగ చైత‌న్య న‌టిస్తున్న మ‌రో చిత్రం ప్రేమ‌మ్. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ప్రేమ‌మ్ ఒక పాట మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌నున్నారు. సాహ‌సం శ్వాస‌గా సాగిపో, ప్రేమ‌మ్...ఈ రెండు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతుంటే...నాగ చైత‌న్య సోగ్గాడే చిన్ని నాయ‌నా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగ చైత‌న్య స‌ర‌స‌న హీరోయిన్ గా స‌మంత‌ని ఫిక్స్ చేసిన‌ట్టు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ తెలియ‌చేసారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందే ఈ చిత్రాన్ని జులైలో ప్రారంభించ‌నున్నారు. ఏమాయ చేసావే, మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య‌...చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న చైతు - సామ్ ల జంట మ‌రోసారి మాయ చేసి ఘ‌న విజ‌యం సొంతం చేసుకుంటార‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.