close
Choose your channels

విజయ్ దేవర తో కమ్ముల...

Thursday, December 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`ఆనంద్‌`, `గోదావ‌రి`, `హ్యాపీడేస్` వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడిగా త‌న మార్కును చూపించిన శేఖ‌ర్ క‌మ్ముల ఈ ఏడాది ఫిదాతో స‌క్సెస్‌ను అందుకున్నాడు. చిన్న చిత్రంగా విడుద‌లైన సెన్సేష‌న్ హిట్ అయిన ఈ సినిమా 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల తెలంగాణ నేప‌థ్యంలో మ‌రో ప్రేమ‌క‌థ‌ను త‌యారు చేస్తున్నాడ‌ట‌.

ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌లోకి వెళుతుద‌ట‌. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తాడ‌ని, ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ట్యాక్సీవాలాగా క‌న‌ప‌డుతున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.