close
Choose your channels

Actor Naresh:నరేష్ ఇంటిపై దుండగుల దాడి, కారు ధ్వంసం.. రమ్య రఘుపతే చేయించిందని ఫిర్యాదు

Monday, February 20, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియర్ నటుడు వీకే నరేష్‌‌ తన కారుపై దాడి జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలోని తన ఇంటి ముందుకు పార్క్ చేసి వుంచి కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడి, దానిని ధ్వంసం చేశారని నరేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఫిర్యాదు చేసిన నరేష్.. దీని వెనుక తన మూడో భార్య రమ్య రఘుపతి వుందని ఆరోపించారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తున్నారు.

ఇదిలావుండగా.. రెండ్రోజుల క్రితం నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పవిత్రా లోకేష్‌పై తన బంధానికి సంబంధించి కొందరు హద్దులు మీరి ట్రోలింగ్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్నారని నరేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక కొందరున్నారని చెప్పిన ఆయన ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు.

బెంగళూరు వ్యక్తికి నన్ను చంపేందుకు సుపారీ :

సుపారీ ఇచ్చి తనను చంపడానికి రమ్య ప్రయత్నిస్తోందని కొద్దిరోజుల క్రితం నరేష్ ఆరోపించారు. బెంగళూరుకు చెందిన రోహిత్ శెట్టి అనే వ్యక్తితో తనను అంతం చేయించడానికి ఒప్పందం కుదుర్చుకుందని నరేష్ ఆరోపించారు. ఈమేరకు పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. తన ఇంటి పరిసరాల్లో కొందరు అనుమానితులు తిరుగుతున్నారని.. రెక్కీ కోసమే వారు ఇదంతా చేస్తున్నారని చెబుతు వీడియో ఫుటేజ్‌ను కూడా నరేష్ విడుదల చేశారు. గతంలో మాజీ మంత్రి రఘువీరా రెడ్డితోనూ ఫోన్ చేయించి బెదిరించిందని ఆయన ఆరోపించారు. రమ్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తనకు విడాకులు ఇప్పించాలని నరేశ్ న్యాయస్థానాన్ని కోరారు.

2010లో రమ్యతో నరేష్ వివాహం:

2010 మార్చి 3న బెంగళూరులో రమ్యతో తనకు వివాహం జరిగిందని, పెళ్లికి తాను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదని.. అయినప్పటికీ తన తల్లి విజయ నిర్మల ఆమెకు రూ.30 లక్షల విలువైన బంగారం చేయించిందని నరేష్ చెప్పారు. పెళ్లయిన కొద్దినెలల నుంచి ఆమె నుంచి వేధింపులు మొదలయ్యాయని.. దీంతో పాటు బెంగళూరులో తన తల్లితో పాటే వుండాలని రమ్య కండీషన్ పెట్టిందని నరేష్ తెలిపారు. ఇదే సమయంలో 2012లో రమ్యకు తనకు రణ్‌వీర్ జన్మించాడని.. అయితే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పలు బ్యాంకులు, కొందరు వ్యక్తుల నుంచి రమ్య లక్షల్లో అప్పులు చేసిందని నరేష్ ఆరోపించారు. చివరికి తన కుటుంబ సభ్యుల నుంచి కూడా రూ.50 లక్షలు తీసుకుందని చెప్పాడు.

రమ్యతో ఇక వేగలేను :

తన ఆస్తి కాజేయడానికి ప్రయత్నించిందని.. అప్పు ఇచ్చిన వారు డబ్బు కోసం తనను వేధిస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడుకుని తనను అంతం చేసేందుకు ప్లాన్ చేసిందని నరేష్ ఆరోపించాడు. గతేడాది ఏప్రిల్‌లో కొందరు రికవరీ ఏజెంట్ల పేరుతో తన ఇంట్లోకి చొరబడ్డారని చెప్పాడు. దీనితో పాటు తనకు తెలిసిన పోలీస్ అధికారి ద్వారా ఫోన్ హ్యాకింగ్ చేయడం నేర్చుకుందని.. దీని సాయంతో తన ఫోన్‌ను హ్యాక్ చేసిందని నరేష్ ఆరోపించాడు. ఈ నరకయాతనను తాను అనుభవించలేకపోతున్నానని.. తనకు విడాకులు ఇప్పించాలని నరేష్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.