close
Choose your channels

చిత్రసీమలో మళ్లీ డ్రగ్స్ కలకలం... మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డ 'సింగం' నటుడు

Thursday, September 30, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిత్రసీమలో మళ్లీ డ్రగ్స్ కలకలం... మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డ సింగం నటుడు

డ్రగ్స్.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్‌వుడ్ చిత్ర పరిశ్రమలను ఎంతగా కుదిపేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసింది ఈడీ. అటు బాలీవుడ్‌లోనూ పలువురి కోసం ఎన్‌సీబీ వేట సాగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య తాజాగే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే డ్రగ్స్ వినియోగిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సింగం-2 సినిమాలో నటించిన నైజీరియన్ ​దేశస్థుడు, నటుడు చాక్‌‌‌విమ్​ మాల్విన్‌‌‌ గుర్తున్నాడు కదా.. ఆ సినిమాలో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు మాల్విన్‌. సీన్‌ కట్‌ చేస్తే నిజ జీవితంలో కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

చిత్రసీమలో మళ్లీ డ్రగ్స్ కలకలం... మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డ సింగం నటుడు

మాల్విన్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. 15 గ్రాముల MDMAతో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ సహా కొన్ని మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే మెల్విన్‌తో సినీ పరిశ్రమకు చెందిన ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయి? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.