స్మిత వెబ్ సిరీస్
Send us your feedback to audioarticles@vaarta.com
90 దశకంలో కుర్రకారును కైపు కళ్లతో మత్తెక్కించిన నటి సిల్క్ స్మిత. దక్షిణాదిన అగ్ర హీరోలందరి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్.. స్పెషల్ రోల్స్‌లో నటించి ఆకట్టుకున్న స్మిత చివరి దశలో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె జీవితాన్ని మిలాన్ లూథారియా డర్టీపిక్చర్ అంటూ తెరకెక్కించారు. విద్యాబాలన్ ఇందులో సిల్క్ స్మితగా నటించింది.
అయితే ఇప్పుడు మరోసారి ఈమె జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసారి వెబ్ సిరీస్ రూపంలో.. దర్శకుడు పా.రంజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, డైరెక్ట్ చేస్తున్నారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ నిర్మాణంలో ముంబైకి చెందిన నిర్మాణ సంస్థ కూడా భాగమని.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.