close
Choose your channels

కబాలి కేరళ రైట్స్ దక్కించుకున్న స్టార్ హీరో..

Thursday, June 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. క‌బాలి ట్రైల‌ర్ యూట్యూబ్ లో స‌రికొత్త రికార్డ్ సాధించి తొలి ఇండియ‌న్ సినిమాగా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎయిర్ ఏషియా విమానాలపై అలాగే రెండు డొమెస్టిక్ ఫ్లైట్స్ తో పాటు, మరో రెండు అంతర్జాతీయ విమానాలకు కబాలి పోస్టర్స్ వేసి ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఏ చిత్రానికి ఈ తరహాలో ప్రచార కార్యక్రమాలు నిర్వ‌హించ‌లేదు. ఇలా ప్రచారం చేస్తున్న తొలి ఇండియన్ మూవీ కాదు తొలి ఏసియ‌న్ మూవీగా కబాలి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.
ఈవిధంగా క‌బాలి ప్ర‌మోష‌న్స్ లో సైతం రికార్డ్ సాధించి తొలి ఏసియ‌న్ మూవీగా చ‌రిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే... దేశ విదేశాల్లో జులై నెల‌లో రిలీజ్ కి రెడీ అవుతున్న క‌బాలి చిత్రం కేర‌ళ రైట్స్ ను మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ ద‌క్కించుకోవ‌డం విశేషం. ర‌జ‌నీకాంత్ సినిమాతో మోహ‌న్ లాల్ అసోసియేట్ అవ్వ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్. కేర‌ళ‌లో మోహ‌న్ లాల్ క‌బాలి చిత్రాన్ని రిలీజ్ చేస్తుండ‌డంతో అక్క‌డ క‌బాలి పై మ‌రింత క్రేజ్ పెరిగింద‌ట‌. రిలీజ్ కి ముందే క‌బాలి ఊహించ‌ని విధంగా చ‌రిత్ర సృష్టిస్తుంటే...ఇక రిలీజ్ త‌ర్వాత ఎలా ఉంటుందో..?

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.