close
Choose your channels

అయోధ్యపై ‘నవంబర్- 9’ నాటి తీర్పే ఫైనల్.. మార్పులుండవ్!

Thursday, December 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అయోధ్యపై ‘నవంబర్- 9’ నాటి తీర్పే ఫైనల్.. మార్పులుండవ్!

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి నవంబర్-09తో సుప్రీంకోర్టు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కే అప్పగించి.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని తీర్పునిచ్చింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యంగ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంలో వేశారు. ఈ రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఛాంబర్ లో అంతర్గతంగా విచారణ జరిపిన అనంతరం తుది నిర్ణయాన్ని ప్రకటించింది.

నవంబర్-09 తీర్పే ఫైనల్!
తీర్పును పున:సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సింగిల్ మాటతో తేల్చేసింది. ఈ క్రమంలో అయోధ్య తీర్పుపై దాఖలైన మొత్తం 18 రివ్యూ పిటిషన్లను కొట్టి పారేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, హిందూ మహాసభ, నిర్మోహి అఖాడాతో పాటు మరో 40 మంది రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవంబరు 9న ఇచ్చిన తీర్పే ఫైనల్.. ఇక మళ్లీ రివ్యూలు.. మార్పులు, చేర్పులుండవ్ అని సుప్రీం కోర్టు తేల్చేసింది.

నవంబర్-09 సుప్రీంకోర్టు ఏం చెప్పింది..!?
వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కే అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని తీర్పునిచ్చింది. మందిరం నిర్మాణానికి మూడునెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని.. కేంద్రానికి మూడు నెలలపాటు కోర్టు గడువిచ్చింది. అయోధ్య చట్టం కింద ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిర్మొహి అఖాడ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సున్నీ బోర్డు వాదనకు పరిమితస్థాయిలో ఆమోదం లభించింది. కాగా.. అయోధ్యలో ఆలయ నిర్మాణం, ముస్లింలకు 5 ఎకరాల స్థలం కేటాయించింది. దీంతో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది.

నాడు తీర్పు చెప్పింది వీరే!
తీర్పు నేపథ్యంలో అయోధ్య భద్రతా వలయంలో ఉన్నది. అయోధ్య ఆలయం వద్దకు యాత్రికులకు అనుమతి నిరాకరించింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే, జస్టిస్‌ ధనుంజయ్‌, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మొత్తం ఐదుగురు అయోధ్య తీర్పును వెలువరించారు. ఏకాభిప్రాయంతో ఐదుగురు న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. నిర్మొహి అఖాడ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సున్నీ వక్ఫ్‌బోర్డు తరచూ మాటమార్చిందని.. అంతర్గతంగా ఉన్న నిర్మాణం ఇస్లామిక్‌ శైలిలో లేదని సీజేఐ తేల్చిచెప్పింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.