close
Choose your channels

Rajamouli:చరణ్‌-సుకుమార్ సినిమాలో ఆ సీన్ హైలైట్.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్..

Tuesday, March 26, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెర్రీ కెరీర్‌లోనే ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. చరణ్‌ నటన, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అప్పటిదాకా చెర్రీ నటన మీద వచ్చిన విమర్శలన్నింటికీ ఈ చిత్రం ద్వారా గట్టి సమాధానం ఇచ్చాడు. దీంతో చెర్రీ-సుక్కు కాంబినేషన్‌ మళ్లీ ఎప్పడు ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు.

తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మించబోతుండగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వబోతున్నారు. ఇలా రంగస్థలం టీమ్ మొత్తం మరోసారి కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ త‌ర్వాత గ్లోబ‌ల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు రామ్‌చ‌ర‌ణ్‌. ఇటు 'పుష్ప' సినిమాతో త‌గ్గేదేలే అంటూ అంద‌రివాడ‌నిపించుకున్నారు సుకుమార్‌. ఈ నేపథ్యంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మీద దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.

తాజాగా ఈ మూవీ ప్రకటనలో గతంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. " చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోను మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

అలాగే రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఈ మూవీ గురించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "ఆర్‌ఆర్‌ఆర్ క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్‌ చరణ్‌ చెప్పాడు. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుంది.. అద్భుతమని తెలిపాడు. అప్పటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం నేను ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీరిద్దరి కెరీర్‌లోనే ఓ మైలురాయిగా ఉంటుంది. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను"అని పేర్కొన్నారు. వీరి వ్యాఖ్యలతో చెర్రీ-సుక్కు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించుకుని బుచ్చిబాబు దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు సుకుమార్ 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ చిత్రం లాస్ట్ షెడ్యూల్ వైజాగ్, హైదరాబాద్‌లో ముగిసింది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేయనున్నారు. ఈ రెండు సినిమాల విడుదల తర్వాత RC 17 షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో 2025 ముగిసే లోపు మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.