close
Choose your channels

Congress:కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. విశాఖ ఎంపీగా సినీ నిర్మాత పోటీ..

Wednesday, April 10, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో 12 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసింది. తొలి జాబితాలో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.

లోక్‌సభ అభ్యర్థులు..

విశాఖపట్నం - పులుసు సత్యనారాయణ రెడ్డి
అనకాపల్లి - వేగి వెంకటేశ్‌
ఏలూరు - లావణ్య కావూరి
నరసరావుపేట - గార్నెపూడి అలగ్జాండర్‌ సుధాకర్‌
నెల్లూరు - కొప్పుల రాజు
తిరుపతి (ఎస్సీ)- డా. చింతా మోహన్‌

అసెంబ్లీ అభ్యర్థులు..

టెక్కలి - కిల్లి కృపారాణి
భీమిలి - అడ్డాల వెంకట వర్మరాజు
విశాఖ సౌత్‌ - వాసుపల్లి సంతోష్‌
గాజువాక - లక్కరాజు రామరాజు
అరకు వ్యాలీ (ఎస్టీ) - శెట్టి గంగాధరస్వామి
నర్సీపట్నం - రౌతుల శ్రీరామమూర్తి
గోపాలపురం (ఎస్సీ) - ఎస్‌. మార్టిన్‌ లూథర్‌
ఎర్రగొండపాలెం (ఎస్సీ) - డా. బూధల అజితా రావు
పర్చూరు - నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
సంతనూతలపాడు (ఎస్సీ) - విజేష్‌ రాజు పాలపర్తి
గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డి. రమేష్‌ బాబు
పూతలపట్టు(ఎస్సీ) - ఎంఎస్‌ బాబు

రెండు జాబితాల్లో ఇటీవల వైసీపీ నుంచి పార్టీలో చేరిన నేతలకు అసెంబ్లీ టికెట్లు కేటాయించారు. ఇందులో నందికొట్కూర్, చింతలపూడి, పూతలపట్టు, కోడుమూరు, యర్రగొండపాలెం, టెక్కలి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి అనూహ్యంగా టెక్కలి అసెంబ్లీ సీటు కేటాయించారు. ఇక్కడి నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు.

ఇక లోక్‌సభ స్థానాల విషయానికొస్తే విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డికి అవకాశం కల్పించారు. నెల్లూరు జాతీయ నేత కొప్పుల రాజు, తిరుపతి నుంచి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్, ఏలూరు నుంచి మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె కావూరి లావణ్య బరిలో దిగనున్నారు. అలాగే కాకినాడ ఎంపీ స్థానం నుంచి మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, కడప నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల పోటీ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.