close
Choose your channels

మ‌హేశ్ వ‌ర్సెస్ విజ‌య్ ..ట్విట్ట‌ర్ వార్‌

Wednesday, April 1, 2020 • తెలుగు Comments

మ‌హేశ్ వ‌ర్సెస్ విజ‌య్ ..ట్విట్ట‌ర్ వార్‌

సోష‌ల్ మీడియా పెరిగిన త‌ర్వాత హీరోలు అభిమానులకు చేరువ‌య్యారు. అలాగే ఫ్యాన్స్ మ‌ధ్య వార్స్ కూడా ఎక్కువ‌య్యాయి. మా హీరో గొప్ప అంటే కాదు.. మా హీరో గొప్ప అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రినొక‌రు దూషించుకుంటున్నారు. ఓ హీరో అభిమానులు మ‌రో హీరోని కించ‌ప‌రుస్తున్నారు. ఒక‌ప్పుడు ఫ్యాన్స్ మ‌ధ్య వార్ అనేది ఓ భాష‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై ఉండేది. కానీ సోష‌ల్ మీడియా పుణ్య‌మాని ఇప్పుడు ప‌ర‌భాషా ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోష‌ల్ మీడ‌దియా వార్ క‌ల్చ‌ర్ కోలీవుడ్‌లో ఎక్కువ‌గా ఉంటుంది. విజ‌య్‌, అజిత్ అభిమానులు గొడ‌వ‌లు ప‌డుతుంటారు. కానీ ఇప్పుడు హ‌ద్దుల దాటుతున్నారు.

ఇటీవ‌ల ఎన్టీఆర్ అభిమానులు, విజ‌య్ అభిమానుల‌కు మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్ జ‌రిగింది. ఇప్పుడు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ విజ‌య్ అభిమానుల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ ఓ రేంజ్‌లో జ‌రుగుతుంది. డమ్మీస్టార్ మ‌హేశ్ అంటూ విజ‌య్ అభిమానులు మ‌హేశ్‌ను ట్రోల్ చేస్తుంటే.. మ‌హేశ్ అభిమానులు ఊరుకుంటారా? రీమేక్ స్టార్ విజ‌య్ అంటూ విజ‌య్‌ను ట్రోల్ చేస్తున్నారు మ‌హేశ్ అభిమానులు. మ‌రి ఈ స్టార్ వార్‌కు ముగింపెప్పుడో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz