close
Choose your channels

సీపీ అంజనీకుమార్‌కు ఉత్తమ్ వార్నింగ్.. ఏం జరిగింది!?

Saturday, December 28, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీపీ అంజనీకుమార్‌కు ఉత్తమ్ వార్నింగ్.. ఏం జరిగింది!?

సినీ ఫక్కీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు ఆ పార్టీ సభ్యులు ర్యాలీ తలపెట్టారు. అయితే పోలీసు శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ఱయించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిగజారిన క్యారెక్టర్, అవినీతి పరుడు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. త్వరలోనే అతని చిట్టా తీసి.. గవర్నర్‌కు సమర్పిస్తామని హెచ్చరించారు.

నీ అంతు చూస్తాం!
‘అంజనీ కుమార్ ఆర్ఏఎస్, సీఎం కేసీఆర్‌కు తొత్తుగా మారాడు. కాంగ్రెస్‌ను అవమాన పరిచేలా ప్రవర్తించాడు.

ఆర్ఎస్‌ఎస్‌కు రోడ్లు ఖాళీ చేసి ర్యాలీకి అనుమతిచ్చారు. ఎంఐఎమ్ సభకు అనుమతిచ్చారు.
కానీ కాంగ్రెస్‌కు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షకు వస్తుంటే కూడా అరెస్ట్‌లు చేశారు. గాంధీభవన్ వద్ద పోలీస్‌లకు ఏం పని..?.

అంజనీ కుమార్ నీ సంగతి చూస్తాం ఉద్యోగం చేసుకోవడానికి వచ్చావ్ నీ ఉద్యోగం నువ్ చేసుకుని పో.

ఓవర్ యాక్షన్ చేసే పోలీస్‌ల అంతు చూస్తాం. అంజనీ కుమార్ ఐపీఎస్‌కు అనర్హుడు.

అతన్ని కమిషనర్ పదవి నుంచి తొలగించాలి గవర్నర్‌ను కలిసి అతనిపై ఫిర్యాదు చేస్తాం
అతడు కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ కేపీఎస్ అని పెట్టుకోవాలి. కేసీఆర్ దొంగనాటకాలు ప్రజలు గమనించాలి. మున్సిపల్ ఎన్నికల్లో అతనికి బుద్ధి చెప్పాలి.

ఓటర్ జాబితా విడుదల చేయకుండా, రిజర్వేషన్లు ప్రకటించకుండా షెడ్యూల్ విడుదల చేసిన ఘనత మన రాష్ట్ర ఎన్నికల సంగానికే దక్కుతుంది. నిన్న ఈ రోజు ఘటనలతో కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది ప్రభుత్వ తొత్తులు ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారు.

గాంధేయమార్గంలో ర్యాలీ చేస్తామంటే అడ్డుకున్నారు

సత్యాగ్రహ దీక్షకు రాకుండా1000 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు’ అని కేసీఆర్, సీపీపై తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సీపీ ఎలా రియాక్ట్ అవుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.