close
Choose your channels

మారుతి చేతుల మీదుగా 'వినోదం 100%' ట్రైలర్‌ విడుదల

Friday, December 18, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్‌ పతాకంపై జైశ్రీరామ్‌ దర్శకత్వంలో విజయ్‌భరత్‌, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్‌లుగా పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'వినోదం%'. బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్‌ మారుతి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో హీరో విజయ్‌భరత్‌, హీరోయిన్‌ ఆశ్విని తదితరులు పాల్గొన్నారు.

అనంతరం డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ..'ట్రైలర్‌ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమాలో ఉన్న విషయం ఏమిటో ట్రైలర్‌లో చక్కగా చూపించారు. డైరెక్టర్‌ జైశ్రీరామ్‌ ఈ చిత్రాన్ని ఎంతో ఫ్యాషన్‌తో చేసినట్లుగా తెలుస్తుంది. యూత్‌ని ఆకర్షించే మంచి ఎంటర్‌టైనర్‌ చిత్రంలా ఉంది. తప్పకుండా మంచి విజయం సాధించి.అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను..'అని అన్నారు.

చిత్ర నిర్మాత పొట్నూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ..'అవుట్‌ అండ్‌ అవుట్‌ 100% కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. బ్యాంకాక్‌, థాయిలాండ్‌ తదితర ప్రదేశాల్లో షూటింగ్‌ చేశాం. రాబోయే క్రిస్టమస్‌ సందర్భంగా ఆడియోను విడుదల చేయనున్నాము..ట్రైలర్‌ని ఆవిష్కరించిన మారుతిగారికి ధన్యవాదాలు..' అన్నారు.

చిత్ర దర్శకుడు జైశ్రీరామ్‌ మాట్లాడుతూ..'బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీల కామెడీ హైలైట్‌గా ఈ చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కించాము. మా హీరో విజయ్‌భరత్‌ చక్కని అభినయాన్ని కనబర్చాడు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా నిర్మించేందుకు సహకరించారు...మేం అడిగిన వెంటనే మారుతిగారు మా చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరించినందుకు..ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము..' అన్నారు.

సంపూర్ణేష్‌బాబు, పృథ్వీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌భరత్‌, అశ్విని, కాంచన, సత్యం రాజేష్‌, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌, శకలకశంకర్‌, జీవా మొదలగువారు ఇతర తారాగణం.

సాంకేతిక నిపుణులు: సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, కెమెరా: రాజేష్‌, ఎడిటింగ్‌: నందమూరిహరి, నిర్మాత: పొట్నూరు శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జైశ్రీరామ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.