close
Choose your channels

మ్యాచ్ మధ్యలో భార్యకు విరాట్ సైగలు.. వీడియో వైరల్..

Thursday, October 29, 2020 • తెలుగు Comments

మ్యాచ్ మధ్యలో భార్యకు విరాట్ సైగలు.. వీడియో వైరల్..

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌లకు అబుదాబి వేదికగా మారిన విషయం తెలిసిందే. ఆర్బీసీ, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మ కూడా అబుదాబీకి వెళ్లింది. మ్యాచ్ మధ్యలో కోహ్లీ చేసిన పని ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అనుష్క ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా.. తానెంత కేరింగ్ హజ్బెండ్ అనేది విరాట్ మరోసారి నిరూపించాడు.

తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్కలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. విరాట్.. అనుష్కకు భోజనం చేశావా? అని సైగల ద్వారా అడిగాడు. దీనికి అనుష్క తన బొటనవేలిని చూపిస్తూ భోజనం చేశానని చెప్పింది. దీంతో విరాట్ ముసిముసిగా నవ్వుతూ కనిపించాడు. మామూలుగా అయితే ఇదో పెద్ద విషయమేమీ కాదు కానీ మ్యాచ్ జరిగిన విషయం కావడంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. అటు ఆటపై దృష్టి సారిస్తూనే ప్రెగ్నెంట్‌తో ఉన్న భార్య విషయంలో కేరింగ్‌గా ఉండటం విరాట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Get Breaking News Alerts From IndiaGlitz