close
Choose your channels

Gaami OTT: ఉగాది కానుకగా విశ్వక్‌సేన 'గామి' ఓటీటీ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?

Thursday, April 4, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Gaami OTT: ఉగాది కానుకగా విశ్వక్‌సేన గామి ఓటీటీ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ ముందు ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ప్రేక్షకులను మరో కొత్త సినిమాతో పలకరించటానికి సిద్ధమైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించిన 'గామీ' చిత్రం స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది.

ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రాన్నిఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుంది. దీంతో అభిమానులు బుల్లి తెరపై సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్(విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ ఆ ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు.

Gaami OTT: ఉగాది కానుకగా విశ్వక్‌సేన గామి ఓటీటీ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?

అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది.

ఇక నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరించటానికి ఏప్రిల్ 12న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సిద్ధమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.