close
Choose your channels

Bigg Boss Telugu 7 : హౌస్‌లో రతిక వర్సెస్ అమర్ , నా జోలికొస్తే తొక్క తీస్తానన్న శివాజీ.. ఒక్క నా కొడుకైనా అంటూ అశ్వినీ పూనకం

Friday, November 3, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నామినేషన్ల పర్వం ముగియడంతో బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేసే పని ప్రారంభించారు. ఇంటి సభ్యులను వీరసింహాలు, గర్జించే పులులు అంటూ రెండు టీమ్‌లుగా విభజించాడు. వీర సింహాలు టీమ్‌లో గౌతమ్, భోలే షావళి, ప్రిన్స్ యావర్, తేజ, శోభాశెట్టి, రతిక వుండగా.. మిగిలినవారు గర్జించే పులులు టీమ్‌లో వున్నారు. ప్రస్తుతం బాల్స్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు పై నుంచి పడే బంతులను సేకరించి.. వాటిని ప్రత్యర్ధుల నుంచి కాపాడుకోవాలి. అలా చేస్తూనే మధ్య మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చే వేరే టాస్క్‌ల్లో గెలవాలి.

బంతులు సేకరించేందుకు సంచులు తీసుకొద్దామని అమర్, గౌతమ్‌‌లు స్టోర్ రూమ్‌కి వెళ్లారు. అయితే అమర్ అక్కడ ఇరు జట్ల బ్యాగ్స్ తీసుకుని గార్డెన్ ఏరియాకు పరుగులు తీశాడు. అతనిని ఆపాలని గౌతమ్ ట్రై చేసినా వీలు కాలేదు. అనంతరం పింక్ జట్టుకు చెందిన బ్యాగ్స్‌ను కింద పడేశాడు. దీనికి రతికకు కోపం వచ్చింది. బ్యాగ్స్ ఎందుకు కిందపడేశావంటూ ప్రశ్నించింది. నా ఇష్టం నేను ఇలాగే పడేస్తా.. ఇది నా స్ట్రాటజీ అంటూ అమర్ ఆన్సర్ ఇచ్చాడు. వెధవ పనిచేయడం దానికి స్ట్రాటజీ అని పేరు పెట్టడం అంటూ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. అమర్ కూడా ఏమాత్రం తగ్గకుండా .. నువ్వు చేసేవి వెధవ పనులు.. నువ్వంటే బయట ఊస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాటలు జాగ్రత్తగా రానీ అంటూ రతిక హెచ్చరించగా వాగ్వాదం తారా స్థాయికి చేరింది.

తర్వాత ఇంటి సభ్యులకు ‘‘ బ్రేక్ ఇట్ ఎయిమ్‌ ’’ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఎల్లో టీమ్ నుంచి అర్జున్, అమర్.. పింక్ టీమ్ నుంచి శోభ, గౌతమ్‌లు పాల్గొన్నారు. దీనిలో భాగంగా బాక్స్ బద్దలు చేసి అందులో వున్న కవర్ తీసుకోవాలి . ఆ సంచిలో వున్న కర్రలను పై నుంచి గురిచూసి గొట్టాల్లో పడేలా వేయాలి. ఈ గేమ్‌లో ఎల్లో టీమ్ విజయం సాధించింది. అయితే గేమ్‌లో ఓడిపోయినందుకు శోభా శెట్టి తెగ ఫీలైంది. మరోవైపు ఛాలెంజ్‌లో గెలిచిన టీమ్‌కు రెండు ఆఫర్లు ఇచ్చాడు. ప్రత్యర్ధి టీమ్‌లోని ఒకరిని తొలగించడం, వారి దగ్గర 500 బాల్స్ తీసుకోవడం. దీనిపై బాగా డిస్కస్ చేసిన శివాజీ టీమ్ 500 బాల్స్ తీసుకోవడం బెటర్ అని ఫిక్స్ అయ్యింది.

అనంతరం పై నుంచి బాల్స్ పడటంతో కంటెస్టెంట్స్ వారిని ఏరుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో గోల్డెన్ బాల్ ఎవరి దగ్గర వుందని బిగ్‌బాస్ ప్రశ్నించాడు. ఆ బాల్ తమ వద్ద వుందని వీర సింహాలు టీమ్ చెప్పింది. ఆ బాల్ వున్న వాళ్లకి స్పెషల్ పవర్ ఇస్తున్నానని.. తమ టీమ్‌లోని వీక్ ప్లేయర్‌ని ప్రత్యర్ధి టీమ్‌లోని ప్లేయర్‌తో మార్చుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో వీర సింహాలు టీమ్ భోలేని అంటు పంపి.. గర్జించే పులులు టీమ్ నుంచి అర్జున్‌ని తీసుకున్నారు. ఇంతలో శివాజీ టీమ్‌లో వున్న బాల్స్‌ని కొట్టేసేందుకు .. గౌతమ్ టీమ్ ప్లాన్ చేస్తుంది. దీనిని గమనించిన శివాజీ.. తన సంచి దగ్గరికి ఎవడైనా వస్తే తొక్క తీస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత గౌతమ్, యావర్, రతిక అమర్‌ని టార్గెట్ చేసి అతని సంచిని కొట్టేయడానికి ట్రై చేస్తారు.

మరోవైపు.. హౌస్‌లో తనపై పెత్తనం చెలాయిస్తున్న వారిపై అశ్వినీ ఫైర్ అయ్యింది. ఈ విషయాన్ని భోలేతో డిస్కస్ చేస్తూ.. వారంతా ఏమనుకుంటున్నారు, వాళ్లేమైనా ఐఏఎస్ ఆఫీసర్లా.. మేము ఎల్‌కేజీ కూడా చదువుకోలేదు. ఒక్కొక్క నా కొడుకు పదవ తరగతి పాస్ అయ్యాడో లేదో అంటూ నానా మాటలు అంటుంది. వాళ్లకు మెచ్యూరిటీ లేదులే అని భోలే సర్దిచెబుతాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.