close
Choose your channels

చిరుతో నాకు ఎలాంటి గొడవల్లేవ్.. అంతా టీడీపీ కుట్రే!

Saturday, October 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరుతో నాకు ఎలాంటి గొడవల్లేవ్.. అంతా టీడీపీ కుట్రే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై గత రెండ్రోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్ట్‌లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పోస్టులన్నీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిమాన సంఘం పేరిట వెలువడటంతో సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతమే చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త వైసీపీ వర్సెస్ మెగా ఫ్యాన్స్‌గా మారిపోయింది. చినికి చినికి గాలివానగా మారడంతో ఎట్టకేలకు చెవిరెడ్డి మీడియా ముందుకొచ్చి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘కుట్ర ఆలోచనలతో టీడీపీ నాపై దుష్ప్రచారం చేస్తోంది. సోషల్‌ మీడియాలో చిరంజీవిపై పోస్టింగ్‌లను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చెవిరెడ్డి అభిమాన సంఘం పేరిట సర్క్యులేట్‌ చేసిన వార్తలు అవాస్తవం. నాకు అభిమాన సంఘాలే లేవు. పోస్టింగ్‌లతో ఎలాంటి సంబంధం లేదు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ అకౌంట్లు కూడా లేవు. చిరంజీవితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి’ అని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదంతా టీడీపీ కుట్రే..!

‘చిరంజీవిపై పెట్టిన పోస్టింగ్‌లను ఖండిస్తున్నాను. ఈ మొత్తం పోస్టింగ్‌ల వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్ర దాగుంది. నేను తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ ఆథారిటీ) చైర్మన్‌గా ఉన్న సమయంలో చిరంజీవి ఎమ్మెల్యేగా పని చేశారు. అప్పటి నుంచి ఆయనతో మంచి సత్సంబంధాలే ఉన్నాయి. నా ఫ్యాన్స్ అసోసియేషన్ పేరిట సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టింగ్స్‌ను తక్షణమే తొలగించాలని పోలీసులను కోరాను’ అని చెవిరెడ్డి తేల్చిచెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.