close
Choose your channels

Pawan Kalyan:తిరుపతి నుంచి వైసీపీని తన్ని తరిమేయాలి: పవన్ కల్యాణ్‌

Saturday, April 13, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిని కాపాడుకోవాలి అంటే వైసీపీని ఇంటికి పంపించేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కార్యకర్తలు పని చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. తిరుపతిలో తెలుగుదేశం, జనసేన నాయకులతో వేర్వేరుగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఇరుపార్టీలు అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఇరు పార్టీలు సమన్వయంతో అడుగులు వేయాలని.. బూత్ స్థాయి నుంచి ఒకే మాటగా, వ్యూహాత్మకంగా ఎలక్షనీరింగ్ చేయాలన్నారు. వైసీపీ ఓటమితోనే తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఊపిరి తీసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.

తొలుత తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతూ “ప్రజారాజ్యం పార్టీ తరఫున శ్రీ చిరంజీవి గారు పోటీ చేసిన సమయంలో అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి చేసినా దౌర్జన్యాన్ని ఎవరూ మరచిపోలేదు. అదే వ్యక్తి గత అయిదేళ్లుగా తిరుపతిలో, తిరుమల కొండపై ఏ స్థాయిలో తన నైజాన్ని చూపిస్తున్నాడో.. ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో కూడా చూస్తున్నాము. ఇప్పుడు అతని వారసుడు. వైసీపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలకు, గూండాగర్దీని అడ్డుకోవలసిన సమయం వచ్చింది. ఇది మన అందరి సమష్టి బాధ్యత. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తున్నాము. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటులో ఎన్నో చర్చలు చేశాము. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి విషయంలో ఎన్నో సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో దాదాపు గెలిచేసిన శ్రీమతి సుగుణమ్మ గారి విషయంలో వైసీపీ అనుసరించిన కుయుక్తులు కూడా ఎవరం మరచిపోలేదు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయానికి వచ్చాము. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అనుభవాన్ని... మా పార్టీకి నాయకులు, కార్యకర్తల బలాన్నీ ఉత్సాహాన్నీ జోడించడం చాలా అవసరం. ఇందుకోసం తెలుగుదేశం నాయకులు అన్ని విధాలా ప్రతి దశలో అండగా ఉండాలని కోరుకొంటున్నాను” అన్నారు.

అనంతరం జనసేన నాయకులతో మాట్లాడుతూ “వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే ప్రధాన అజెండాగా కూటమి పని చేస్తుంది. ఇందుకోసం త్యాగాలు చేశాము. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు రక్షించుకోలేకపోతే నాయకులుగా మనం ప్రజలకు అన్యాయం చేసినవాళ్లం అవుతాము. జనసేన, తెలుగు దేశం కార్యకర్తలు ఒకే లక్ష్యంగా పని చేసి వైసీపీని సాగనంపాలి. తిరుపతి నగరంలో వైసీపీ ముఠాలు ఎన్ని రకాల దౌర్జన్యాలకు దిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. చిన్నపాటి వ్యాపారులను, అంగల్లు పెట్టుకొని బతికేవాళ్లను వేధించి వేధించి వదిలారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకు జీ హుజూర్ అనాలి అనే పెత్తందారీ పోకడలు చూపిస్తున్నారు. ఈ దశలో జనసేన బాధ్యత తీసుకొని ముందడుగు వేసింది. తెలుగుదేశానికి ఉన్న సంస్థాగత నిర్మాణ బలాన్ని ఉపయోగించుకొని మనకు ఉన్న జనాదరణను జోడించి ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకుందాము” అని తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు వైసీపీ ఎన్నికల్లో అనుసరించే కుతంత్రలను వివరించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలో ఎన్ని అక్రమాలకు పాల్పడిందీ ఉదహరిస్తూ బోగస్ ఓట్లు భారీగా తిరుపతిలో చేర్చేసిన క్రమంలో వాటిని కట్టడి చేయడంపై పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక తిరుపతి పర్యటనలో భాగంగా నగరానికి చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, తటస్తులతో పవన్ కల్యాణ్‌ సమావేశమై కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని ఏవిధంగా రక్షించుకుంటాము అని వివరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.