close
Choose your channels

CM Jagan:వైసీపీకి సోషల్ మీడియానే బలం.. ఈ యుద్ధంలో మనదే విజయం: సీఎం జగన్

Tuesday, April 23, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా భీమిలిలో సోషల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఒక ప్రాణాన్ని బలి తీసుకునేంతగా వారి కుట్రలు వెళ్లాయని ఆరోపించారు. తెనాలిలో ఇంటి పట్టా పొంది ఆనందంలో ఉన్న గీతాంజలి అనే మహిళను ఎంత దారుణంగా ట్రోల్ చేసి వేధించారో చూశామని పేర్కొన్నారు.

ఇటువైపు జగన్ ఒక్కడే ఒకడు.. అటువైపు చూస్తే అంతమంది కూడగట్టుకుని వస్తున్నారన్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్ తట్టుకుని నిలబడగలుతున్నాడంటే దానికి మీరే కారణమని అన్నారు. వారికి పెద్ద పెద్ద పత్రికలు అండవచ్చని కానీ మనకు సోషల్ మీడియా ఉందన్నారు. వైసీపీకి సోషల్ మీడియానే బలమని పేర్కొన్నారు. విజయానికి మనం చేరువలో ఉన్నామనే దానికి సోషల్ మీడియాలో మనపై జరుగుతున్న దాడే నిదర్శనమని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వేధింపులకు గురయిన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సెల్‌ఫోన్ ఉన్న చెల్లెలు, తమ్ముడు జగన్‌కు తోడుగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియా వింగ్ చూపుతున్న ఆప్యాయత, అనురాగాలకు ఎంత చేసినా తక్కువే అవుతుందన్నారు. అన్ని రకాలుగా అందరికీ తోడుగా ఉంటానని భరోసా ఇస్తున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అలాగే మరోసారి వైజాగ్ నుంచి పరిపాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ అనేది ఏపీకి సిటీ ఆఫ్‌ డెస్టినీ అని.. ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన చేస్తే, ఐటీలో ఇతర నగరాలతో పోటీపడుతుందన్నారు. అంతేకాకుండా విజయవాడలో తనపై జరిగిన రాయి దాడిపైనా స్పందిస్తూ ప్రాణాలతో బయటపడ్డానంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాయబోతున్నాడని తెలిపారు. తనకు భయం లేదని.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో గెలుపు ఖాయమని జగన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.