close
Choose your channels

30 ఏళ్లు జగనే సీఎం.. కమెడియన్లే నేడు కింగ్‌లు!

Saturday, May 25, 2019 • తెలుగు Comments

30 ఏళ్లు జగనే సీఎం.. కమెడియన్లే నేడు కింగ్‌లు!

ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ముప్పై ఏళ్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. వైసీపీ విజయ దుందుభి మోగించిన అనంతరం తొడగొట్టిన ఆయన శనివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టిన రోజు జగన్ విజయం సాధించారని పృథ్వీ చెప్పారు. కమెడియన్‌లు ఈరోజు కింగ్‌లు అయ్యారని ఆయన తనను విమర్శించిన వారికి కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగని ఆయన.. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ఎన్నికలు సర్వేలు చేసి అట్టర్ ప్లాప్ అయిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్‌కు చిలకను కోని ఇస్తాం.. ఇక జోస్యం చెప్పుకోవాల్సిందేనన్నారు.

జగన్‌కు వీరతిలకం దిద్దారు!

"వైఎస్ జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర చేసి జనాల కష్టాలు విన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలిసిన ఏకైక నాయకుడు.. ప్రజాసమస్యలను పరిష్కారం చేస్తారు. నందమూరి తారకరామారావు పార్టీ పెట్టినపుడు ఇచ్చిన తీర్పు మళ్ళీ ఇప్పుడు జగన్‌కు ఇచ్చారు. జగన్ నవరత్నాల మీద తొలి సంతకం పెడతారు. పదవుల కోసం నేను వైసీపీలోకి రాలేదు.. కార్యకర్తల్లాగా పనిచేశాము. జనసేన నాయకులు మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు మంచి మెజారిటీ ఇచ్చాయి. కులాల కోసం కాకుండా కాపులు కూడా వైసీపీకి ఓట్ వేశారు. మంత్రులు అంత ఓడిపోతారని ముందే చెప్పాము అందరూ ఓడిపోయారు. మంగళగిరిలో 100 కోట్లు పెట్టిన నారా లోకేష్ గెలవలేక పోయారు.. ఆఖరికి ఆళ్ల రామకృష్ణారెడ్డినే ప్రజలు ఆదరించి గెలిపించారు. అయ్యన్నపాత్రుడు, నారాయణ కూడా 100 కోట్లు ఖర్చు పెట్టారు.. చివరికి వాళ్ళూ గెలవలేదు. పసుపు కుంకుమ పథకంతో మేము గెలుస్తామని చంద్రబాబు అనుకున్నారు..  అదే పసుపు చంద్రబాబుకు రాసి.. కుంకుమ వీర తిలకంగా జగన్‌కు రాశారు. మా 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి పార్టీ తీసుకుంటే మీకు అదే 23 మంది ఎమ్మెల్యే గెలిచారు.. మా ముగ్గురు ఎంపీలను మీరు తీసుకుంటే మీకు అదే ముగ్గురు ఎంపీలు గెలిపించారు" అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

జనాలు నమ్మలేదు..

వైసీపీ నేత, సినీ నటుడు కృష్ణుడు మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా వైఎస్జగన్ పాలన చేస్తాడన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మేం వెళ్తున్నామన్నారు. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలకృష్ణ ఎలా గెలుస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నాయకుల ద్వంద మాటల వలన టీడీపీ ఓడిపోయిందని.. అబద్దాలు చెప్పడం వలనే జనాలు టీడీపీ నమ్మలేదని కృష్ణుడు చెప్పుకొచ్చారు.

Get Breaking News Alerts From IndiaGlitz