close
Choose your channels

'బాహుబలి2' ట్రైలర్ రిలీజ్ డేట్

Tuesday, September 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న బాహుబ‌లి పార్ట్ 2 బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ 2017 ఏప్రిల్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఆర్కా మీడియా బ్యాన‌ర్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవిని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌ల‌కు ముందే బిజినెస్ పరంగా క్రేజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. నవంబర్ కు సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలని ప్లానింగ్.

అయితే అంత కంటే ముందే అంటే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తుందట. మరి రాజమౌళి నవంబర్ కు షూటింగ్ పూర్తి చేస్తాడా? ప్రభాస్ అభిమానుల కోరిక తీరుస్తాడా అని చూడాలి. సినిమాను ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.