close
Choose your channels

శాతకర్ణి విజయం మరింత బాధ్యత పెంచింది - బాలకృష్ణ..!

Thursday, January 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ‌, శ్రియ‌, క్రిష్ ఐమ్యాక్స్ లో సంద‌డి చేసారు.
ఐమ్యాక్స్ లో ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో బాల‌య్య మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల‌తో పాటు విదేశాల్లో కూడా ఈ చిత్రానికి అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. ఈ చిత్రాన్ని 79 రోజుల్లో పూర్తి చేసిన డైరెక్ట‌ర్ క్రిష్ కు, చిత్ర నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను. ఏపీ సి.ఎం చంద్ర‌బాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఈ చిత్రాన్ని విజ‌య‌వాడ‌లో వీక్షించ‌నున్నారు. నాన్న గారు చేయాలి అనుకున్న పాత్ర నేను చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి అజ‌రామ‌రంగా నిలుస్తుంది. ఈ విజ‌యం నా పై మ‌రింత బాధ్య‌త పెంచింది అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.