close
Choose your channels

బెల్లంకొండ సినిమాలో విలన్ గా...

Tuesday, July 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లుడు శీను సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా స‌రైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను దర్శకత్వంలో `జ‌య‌జానకి నాయ‌క‌` సినిమా రూపొందుతోంది. ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.
ఈ సినిమాను ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో తేజా గోవింద్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ప్రేమ‌మ్ సినిమాలో చైత‌న్య ఫ్రెండ్స్‌లో ఒక‌డిగా ఎంట్రీ ఇచ్చిన తేజా గోవింద్‌ను బోయ‌పాటి ప‌వ‌ర్‌ఫుల్ విలన్ పాత్ర‌లో చూపించ‌బోతున్నాడ‌ట‌. స‌రైనోడులో ఆది పినిశెట్టి విల‌నిజం ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ సినిమాలో కూడా తేజా గోవింద్ పాత్ర అలా ఉంటుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.