close
Choose your channels

దిలీప్ , రెజీన జంటగా 'హరే రామ హరే కృష్ణ' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Friday, May 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయిని దర్శకునిగా పరిచయం చేస్తూ నూతన నిర్మాత నవీన్‌ రెడ్డి నిర్మిస్తున్న `హ‌రే రామ హ‌రే కృష్ణ‌` చిత్రం ఈరోజు శుక్రవారం హైదరాబాద్‌ లోని శామీర్ పేట లోగల ఓ దేవాలయంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది.
ఈ సందర్భంగా....
దర్శకుడు అర్జున్‌సాయి మాట్లాడుతూ - దర్శకుడుగా నా తొలి చిత్రమిది. కామెడికి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ స్క్రిప్ట్‌ను తయారుచేసుకున్నాను. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ రోజు ప్రారంభమయిది. పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది'' అన్నారు.
రెజీనా మాట్లాడుతూ - ''వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. హెచ్‌.ఆర్‌.డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అమ్మాయి పాత్ర నాది.సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గిపోతున్నాయి. అలా ఆదరణ తగ్గిపోతున్న సంప్రదాయ కళలను కాపాడటానికి ప్రయత్నించే యువతి పాత్రలో నేను నటిస్తున్నాను అన్నారు.
నిర్మాత నవీన్‌రెడ్డి. ఎన్‌ మాట్లాడుతూ - ఈ రోజు హైదరాబాద్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది. హీరో దిలీప్, నాయిక రెజీనా, ఆమని ల పై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. పది రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఈ తొ లి షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా చిత్ర్రీకరణ జరుగుతుందని అన్నారు.
దిలీప్‌ప్రకాష్‌ మాట్లాడుతూ - ''హీరోగా నా తొలి చిత్రమిది. తొలి సినిమానే మంచి సీనియర్స్‌ ఉన్న టీంతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.
ప్రకాష్‌రాజ్‌, ఆమని, నాజర్‌, కృష్ణభగవాన్‌, కాశీవిశ్వనాథ్‌, అలీ, పృథ్వీ, నాగినీడు, రచ్చరవి, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రమణ గోపిశెట్టి, కళ: బ్రహ్మకడలి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: నవీన్‌ రెడ్డి .ఎన్‌, రచన-దర్శకత్వం: అర్జున్‌ సాయి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.