close
Choose your channels
కోటి వ్యూస్ దువ్వాడ...
Monday, March 20, 2017 • తెలుగు Comments

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్‌.ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం డిజె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ..స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేష‌న్‌లో మూవీ అంటే ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటు మెగా అభిమానులు, అటు ఇండ‌స్ట్రీ అంతా ఎలాంటి సినిమా రానుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూశారు.

ఇప్పుడున్న నిర్మాత‌ల్లో స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత దిల్‌రాజు నిర్మాత‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మాస్ యూత్ అండ్ ప‌వ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో డి.జె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అనే సినిమాను అనౌన్స్ చేశారు.ఆర్య‌, ప‌రుగు వంటి సూప‌ర్ డూప‌ర్‌హిట్ మూవీస్ త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో మూవీ ఒక‌టి, హరీష్ శంక‌ర్‌, బ‌న్ని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌, బ‌న్ని కాంబినేష‌న్‌లో మూవీ ఇలా క్రేజీ కాంబినేష‌న్స్ అంతా ఒకే సినిమాకు కుద‌రడంతో.. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకు పెరుగుతూనే వ‌చ్చాయి. అనుకున్న‌ట్లుగానే ఆ అంచ‌నాలెలా ఉన్నాయో టీజ‌ర్‌తో నిరూపిత‌మైంది. టీజ‌ర్ విడుద‌లైతే ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. లెటెస్ట్‌గా ఈ సినిమా టీజ‌ర్ కోటి వ్యూస్‌ను దాటేసింది. సినిమాను మే 12న విడుద‌ల చేయ‌బోతున్నారు.