close
Choose your channels

అఖిల్‌కు హీరోయిన్ దొరికేసింది...?

Wednesday, September 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ హీరోగా వ‌చ్చిన అఖిల్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర స‌క్సెస్ కాలేదు. దాంతో ఓ ర‌కంగా నాగార్జున అండ్ అక్కినేని ఫ్యామిలీ డిస్ట్ర‌బ్ అయ్యారు. అయితే రెండో సినిమా విష‌యంలో నాగార్జున మ‌రింత కేర్ తీసుకున్నాడు. అఖిల్ ఈ డైరెక్ట‌ర్‌తోనో, ఆ డైరెక్ట‌ర్‌తోనో సినిమా చేస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తూనే వ‌చ్చాయి.

ఇటీవ‌ల హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌నుకుని కొన్ని అనివార్య కార‌ణాల‌తో సినిమాను ప‌క్క‌న పెట్టేశారు. ఇటీవ‌ల నాగార్జున అఖిల్ రెండో సినిమాను మ‌నం ఫేమ్ విక్ర‌మ్‌కుమార్ తెర‌కెక్కిస్తాడ‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన క‌థ కూడా సిద్ధ‌మైంద‌ని నాగ్ తెలిపారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నానితో జెంటిల్‌మ‌న్ చిత్రంలో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన నివేద థామ‌స్ న‌టించ‌నుంద‌ట‌. అలాగే సినిమాకు ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.