close
Choose your channels

ఐఫా కి హోస్ట్ గా అల్లు శిరీష్...

Saturday, November 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌తి సంవ‌త్స‌రం గ్రాండ్ గా జ‌రిగే చ‌ల‌న చిత్ర అవార్డ్స్ వేడుక‌లో ఐఫా ఒక‌టి. ఐఫా అంటే ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియా ఫిల్మ్ అకాడ‌మీ. ఈ వేడుక‌లు ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ లో మాత్ర‌మే జ‌రిగేవి. ఫ‌స్ట్ టైం ఐఫా వారు సౌత్ ఇండియ‌న్ సినిమాని కూడా ద్రుష్టిలో పెట్టుకుని సౌత్ ఇండియ‌న్ ఐఫా అవార్డ్స్ వేడుక‌ని నిర్వ‌హిస్తున్నారు.

ఈ వేడుక‌కి క‌మ‌ల్ హాస‌న్, నాగార్జున‌, వెంక‌టేష్, త‌మ‌న్నా, రానా ల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. ఫ‌స్ట్ సౌత్ ఐఫా వేడుక‌కి ఐఫా ఉత్స‌వ‌మ్ అని పేరు పెట్టారు. డిసెంబ‌ర్ మొద‌టివారంలో ఈ ఉత్స‌వంను హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఫా ఉత్స‌వ‌మ్ లో తెలుగు కేట‌గిరికీ అల్లు శిరీష్ హాస్ట్ గా చేస్తుండ‌డం విశేషం. త్వ‌ర‌లోనే ఈ వేడుక‌కు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.