close
Choose your channels

క్లైమాక్స్ లో అందమైన ప్రేమ కథా చిత్రం 'జానకి రాముడు'

Saturday, January 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ సంజయ్, మౌనిక జంటగా కావేరి ట్రావెల్స్ సమర్పణలో తమ్మినీడి సతీష్ బాబు దర్శకత్వంలో ఎం.పి.నాయుడు నిర్మిస్తున్న ప్రేమ కథా చిత్రం జానకి రాముడు. షూటింగ్ చివరి దశలో ఉంది. అంతే వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ చేయడానికి నిర్మాత ఎం.పి.నాయుడు ప్లాన్ చేస్తున్నారు. కావేరి ట్రావెల్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ ను విభిన్నంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు తమ్మినీడి సతీష్ బాబు మాట్లాడుతూ... జానకి రాముడు అనే సినిమా ఒక అందమైన పల్లె టూరి వాతావారణంలో జరిగే ప్రేమ కథ. ఎంత అందమైన ప్రేమ కథ అంటే ఇందులోని కథానాయకుడు... తొలకరి చినుకుల స్పర్శకు పులకరించిన మట్టి పరిమళం నీ జ్ఞాపకం. ఇంత అందంగా ప్రేమించే మనసు నాకుంది. అంతే అందంగా ఆస్వాదించే హృదయం నీకుందా... అని అడుగుతాడు. దానికి ఆమె మౌనం దాల్చగా... నా మనసుకే మాటలొస్తే పలికే తొలిమాట నువ్వంటే నాకిష్టం. అంటూ తన మనసులోని ప్రేమను తెలియజేస్తాడు. దాన్ని కథానాయకి ఎంత ఆస్వాదించింది అంటే నా ఊపిరి ఆగిపోయేటప్పుడు నా కనులు చూసే ఆఖరి రూపం నీదై ఉండాలి. అంటూ తన ప్రేమని తెలియజేస్తుంది. ఇంత సున్నితమైన భావాలతో కూడిన ఈ ప్రేమకథలో ఏం జరిగింది ఎలా ముగిసింది. అన్నదే జానకి రాముడు కథ. మా నిర్మాత ఎం.పి.నాయుడు ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేస్తాం. అని అన్నారు.
నిర్మాత ఎంపి.నాయుడు మాట్లాడుతూ.... జానకి రాముడు అనే అందమైన టైటిల్ కు తగ్గ కథ కుదిరింది. మా దర్శకుడు సతీష్ బాబు ప్రేమ కథా చిత్రాల్లో నిలిచిపోయే విధంగా తెరకెక్కిస్తున్నారు. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమ కథ ఇది. అందమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా పబ్లిసిటీని సైతం విభిన్నంగా ప్లాన్ చేస్తున్నాం. కావేరి ట్రావెల్స్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వినూత్నంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అన్ని వర్గాల్ని మెప్పించే చిత్రంగా నిర్మిస్తున్నాం. మరి కొద్ది రోజుల్లోనే ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరి రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అని అన్నారు.
నవీన్ సంజయ్, మౌనిక, శివ కృష్ణ, సుధ, పవిత్ర లోకేష్, ప్రియాంక, అర్జున్, సూర్య, నల్ల వేణు, కమల్, గుండు సుదర్శన్, జాకీ, సుదర్శన్, కిరణ్, మీనా కుమారి, గీతాంజలి,

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.