close
Choose your channels

కార్తీ, రకుల్ జంటగా ఆదిత్య మ్యూజిక్ ఉమేశ్ గుప్తా సినిమా 'ఖాకి - ది పవర్ ఆఫ్ పోలీస్'

Tuesday, September 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌`. ఈ సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాల సంగీతాన్ని విడుదల చేసి సంగీత ప్రపంచంలో, శ్రోతల మదిలో సముచిత స్థానాన్ని సంపాదించుకుందీ సంస్థ. రెండున్నర దశాబ్దాలు సినిమా రంగాన్ని అతి దగ్గరగా పరిశీలించిన అనుభవంతో ఆదిత్య మ్యూజిక్‌` ఉమేశ్‌గుప్తా తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. అందులో భాగంగా కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తమిళ సినిమా ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు`ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగులో ఖాకి`గా విడుదల చేస్తున్నారు ఉమేశ్‌ గుప్తా. ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌`... అనేది ఉపశీర్షిక. సూపర్‌ హిట్‌ తమిళ సినిమా చతురంగ వేటై్ట` ఫేమ్‌ హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్‌` సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ– ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్‌ పరంగా ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సినిమా రైట్స్‌ తీసుకున్నా. తెలుగులో రన్‌ రాజా రన్‌`, జిల్‌`, బాబు బంగారం`, హైపర్‌` తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ సినిమాకూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అతి త్వరలో టీజర్ ను, పాటలను , చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.