close
Choose your channels

మహేష్ సినిమా...మొదలెట్టేశారు...

Wednesday, March 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సినిమా అంటే ఎంతో క్రేజ్‌, భారీ అంచ‌నాలు నెల‌కొని ఉంటాయి. అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమా యూనిట్ వియ‌త్నాం వెళుతుంది. ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఇంకా సందిగ్ధ‌త వీడ‌లేదు. ముందు సినిమాకు సంభ‌వామి అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేసినా రీసెంట్‌గా ఈ సినిమాకు మ‌ర్మం అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.
అయితే ఇప్పుడు అభిమ‌న్యు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు ఈ రూమ‌ర్స్‌కు తిరుగుండ‌ద‌నే విష‌యంలో సందేహం లేదు. ఈ సినిమాను జూన్ 23న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. మ‌హేష్ ఇందులో స్పై క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. ర‌కుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య విల‌న్ పాత్ర చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.