close
Choose your channels

సెప్టెంబర్ 9న చెన్నైలో 'స్పైడర్' ఆడియో సెప్టెంబర్ 15న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

Thursday, September 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 9న చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే సెప్టెంబర్‌ 15న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.