close
Choose your channels
'ఓటర్ ' గా విష్ణు
Monday, March 20, 2017 • తెలుగు Comments

మంచు విష్ణు ఇప్పుడు రెండు సినిమాల‌ను ట్రాక్  ఎక్కిస్తున్నాడు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ఎల్‌.కుమార్ చౌద‌రి నిర్మిస్తున్న చిత్రం `అచారి అమెరికా యాత్ర‌` రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. అమెరికాలోనే ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ జ‌రుపుకోనుంది. బ్ర‌హ్మానందం ఇందులో కీల‌క‌పాత్ర‌ధారిగా క‌న‌ప‌డ‌తారు. ఈ సినిమాతో పాటు మంచు విష్ణు, సుర‌భి హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమా కూడా త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. ఈ సినిమాకు వోట‌ర్ అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నారు. అనూప్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.