close
Choose your channels
నాని నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్...
Monday, March 20, 2017 • తెలుగు Comments

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి`. రీసెంట్‌గా 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రీసెంట్‌గా అమెరికా షెడ్యూల్ పూర్తయ్యింది. ప్ర‌స్తుతం వైజాగ్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. వైజాగ్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది.

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను జూలై 11న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. నాని రీసెంట్ హిట్ నేను లోక‌ల్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెలకొన్నాయి. యు.ఎస్ ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు ప్యాన్సీ రేటుకే అమ్ముడైపోయింద‌ని టాక్‌.