close
Choose your channels

మొదటి పార్ట్ లోనే ఎన్టీఆర్ థ్రిల్లింగ్ మూమెంట్స్..

Saturday, July 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినిమా రంగంలోని స్టార్స్ అంద‌రూ ఇప్పుడు బుల్లితెర వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. అందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. తెలుగులో ప్ర‌సారం కానున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షో రేపటి నుండి(జూలై 16) స్టార్ మా టీవీలో ప్ర‌సారం కానుంది. 12 మంది సినీ సెల‌బ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొంటారు. వీరంద‌రినీ 60 కెమెరాల‌తో 71 రోజుల పాటు ఓ గదిలో వారి ప్ర‌తి క‌ద‌లిక‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ ఉంటారు. వీరిలో ఒక‌రిని ఫైన‌ల్ విజేత‌గా ప్ర‌క‌టిస్తారు.

ఇందులో కంటెస్టెంట్స్‌కు, బిగ్‌బాస్‌కు మ‌ధ్య ఎన్టీఆర్ వార‌ధిగా ప‌నిచేస్తారు. అలాగే ఎన్టీఆర్ వ్యాఖ్యాత అన‌గానే అభిమానులు, ప్రేక్ష‌కులు ఆయ‌న ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తారా అనే సందేహం కలుగుతుంది. ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా చేస్తారా అని కొంద‌రు అడిగితే త‌ప్ప‌కుండా, త‌న డ్యాన్స్‌ను బిగ్‌బాస్‌లో చూడొచ్చున‌ని ఎన్టీఆర్ ఇటీవ‌ల తెలిపారు. అయితే తాజా స‌మాచారం ప్రకారం ఎన్టీఆర్ డ్యాన్స్ షో ఎప్పుడో కాకుండా తొలి భాగంలోనే ఉంటుంద‌ని అంటున్నారు. టాలీవుడ్లో ఎనర్జిటిక్ డ్యాన్స‌ర్‌గా ఉన్న ఎన్టీఆర్ బుల్లితెర‌పై డ్యాన్స్ చేయ‌నుండ‌టం ఇటు అభిమానులకు, అటు ప్రేక్ష‌కులకు థ్రిల్లింగే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.