close
Choose your channels

రాజుగారిగ‌ది2 ట్రైల‌ర్‌.. మ‌రో రెండు రోజుల్లో

Monday, September 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశ‌మివ్వ‌డ‌మే కాకుండా.. కొత్త పాత్ర‌ల‌కు చిరునామాగా నిల‌వ‌డంలోనూ అక్కినేని నాగార్జున ముందుంటారు. ప్ర‌స్తుతం నాగ్ చేస్తున్న మ‌రో కొత్త పాత్ర మెంట‌లిస్ట్ క్యారెక్ట‌ర్‌. రాజుగారి గ‌ది2 కోసం ఆయ‌న ఈ పాత్ర‌ని పోషిస్తున్నారు.

2015లో విడుద‌లైన రాజుగారి గ‌దికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ఇందులో స‌మంత ఆత్మ పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం ట్రైల‌ర్‌ని అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌నున్నారు.

అక్టోబ‌ర్ 13న దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానున్న రాజుగారి గ‌ది2పై అక్కినేని అభిమానుల్లో మంచి అంచ‌నాలున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.