close
Choose your channels

ఆ డైరెక్టర్ కి మరో ఆఫర్ ఇచ్చిన రామ్..

Tuesday, January 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన తాజా చిత్రం నేను..శైల‌జ‌. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించారు. జ‌న‌వ‌రి 1 న రిలీజైన నేను..శైల‌జ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. విభిన్న క‌థాంశంతో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన నేను..శైల‌జ అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. శివ‌మ్ ఫ్లాప్ త‌ర్వాత మంచి విజ‌యాన్ని అందించిన డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌కి రామ్ మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. మంచి ల‌వ్ స్టోరి రెడీ చేయ్...మ‌ళ్లీ క‌ల‌సి సినిమా చేద్దాం అన్నాడ‌ట‌. నిర్మాత‌ల నుంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ప్ప‌టికీ..రామ్ తో మ‌రో సినిమా చేయ‌డానికి ఓకే అన్నాడ‌ట డైరెక్ట‌ర్ కిషోర్. ఈ చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై రామ్ సోద‌రుడు క్రిష్ణ చైత‌న్య నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి..ఈసారి రామ్ తో కిషోర్ ఎలాంటి ప్రేమ‌క‌థ ను తెర‌కెక్కిస్తాడో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.