'హైపర్ ' సెన్సార్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). సినిమాను సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో విడుదలకు మార్గాలన్నీ సుగమనమైనట్లే. కందిరీగ తర్వాత రామ్ ,సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా విడుదలైన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ తో రానున్న హైపర్ ఈసారి రామ్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.