close
Choose your channels

'సంఘమిత్ర' ఫస్ట్ లుక్

Friday, May 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శృతిహాస‌న్ టైటిల్ పాత్ర‌లో, జ‌యం ర‌వి, ఆర్య లీడ్ రోల్స్‌లో సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `సంఘ‌మిత్ర‌`. 150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. చెన్నై సొగ‌స‌రి శృతిహాస‌న్ ఈ సినిమా కోసం క‌త్తి సాము నేర్చుకోవ‌డం విశేషం.

లండ‌న్‌లో టిమ్ క్లోజ్ అనే మాస్ట‌ర్ ద‌గ్గ‌ర శృతిహాస‌న్ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ట్ర‌యినింగ్ తీసుకుంటుంది. భారీ బ‌డ్జెట్‌తో, భారీ సెట్టింగ్స్‌, తారాగ‌ణంతో రూపొంద‌నున్న ఈ చిత్రం కోసం అంద‌రూ బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. బాహుబ‌లి త‌ర‌హాలో రెండు భాగాలుగా రూపొంద‌నున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రూపొందించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.