close
Choose your channels

తలకోనలో సింగం

Wednesday, September 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో సీక్వెల్ `ఎస్‌-3`(సింగం3) సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో డిసెంబర్ 16న విడుదల చేయనున్నారు. సింగం సీక్వెల్ సక్సెస్ లతో ఇప్పుడు రానున్న మూడో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా చిత్రీకరణ పూర్తి కాకమునుపే తమిళంలో థియేట్రిక‌ల్ హ‌క్కులు దాదాపు 41 కోట్ల రూపాయలు చెల్లించి హ‌క్కులు సొంతం చేసుకున్నార‌ని టాక్‌.

అలాగే తెలుగులో కూడా నైజాం, ఆంధ్ర‌లకు సంబంధించి 18 కోట్ల రూపాయ‌ల‌ ఫ్యానీ రేటు చెల్లించే నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాడ‌ని స‌మాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ ను తలకోనలో హీరో సూర్య, విలన్ అనూప్ లపై చిత్రీకరిస్తున్నారట. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.