close
Choose your channels

'ఉపేంద్ర 2' మూవీ రివ్యూ

Friday, August 14, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉపేంద్ర ఈ పేరుని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోరు. ఎందుకంటే ఈ సినిమాతో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగునాట కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ సినిమా తీసిన పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత ఉపేంద్ర చేసిన సినిమానే ఉపేంద్ర2. నేను అనే అహన్ని మనిషి వదులుకోవాలని ఉపేంద్ర లో చెప్పిన ఉపేంద్ర, నువ్వు అనే కాన్సెప్ట్ ను ఉపేంద్ర 2 చెప్పడానికి ప్రయత్నించాడు. ఉపేంద్ర డైరెక్షన్ అంటే చాలా ట్విస్ట్స్ ఉంటాయి. అది అర్థం చేసుకోవాలంటే కొద్దిగా టైమ్ పడుతుందనే మాట వాస్తవం. మరి ఈ నువ్వు అనే కాన్సెప్ట్ ను ఉపేంద్ర ఎలా మేనేజ్ చేశాడో తెలుసుకోవాలంటే సినిమా సమీక్షలోకి వెళ్లాల్సిందే..

కథ

ఓ కాలేజ్ స్టూడెంట్ అయిన ఖుషీ(క్రిస్టినా అకిహివా), తన ప్రొఫెసర్ మెదడు గురించి, మనిషి నడవడిక గురించి చెప్పిన మాటలు విని ఇన్ స్పైర్ అవుతుంది. గతం, ఫ్యూచర్ గురించి కాకుండా వర్తమానం గురించి ఆలోచించే మనిషే కరెక్ట్ గా పనిచేసుకుంటూ వెళతాడని ఆ ఫ్రొఫెసర్ చెబుతాడు. అలాంటి వ్యక్తిత్వమున్న నువ్వు(ఉపేంద్ర) అనే వ్యక్తిని వెతుక్కుంటూ వెళుతుంది. చివరికి ఓ గ్రామంలో గతం, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా వర్తమానం గురించి ఆలోచించే నువ్వు ఆమెకు కనడపడతాడు. నువ్వు ప్రవర్తన నచ్చిన ఖుషీ అతన్ని ప్రేమిస్తుంది. అలాంటి సమయంలో శైజల(పారుల్ యాదవ్)వల్ల నువ్వు గురించి ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి? అసలు నువ్వు ఎవరు? నేను ఉన్నాడా, ఉంటే ఈ కథకి అతనికి లింక్ ఏంటి?అసలు మందాకిని ఎవరు? చివరికి ఉపేంద్ర ఈ సీక్వెల్ ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

సమీక్ష

ఈ సినిమాలో ఉపేంద్ర డైరెక్షన్ స్టయిల్ కనపడుతుంది. సినిమా స్టార్టింగ్ లోనే ఎండిండ్ స్క్రోల్స్, ఎండింగ్ లో స్టార్టింగ్ పడాల్సిన టైటిల్స్ కనపడతాయి. మధ్యలో ఓ పది నిమిషాలు స్క్రీన్ పై బొమ్మ కనపడదు. ఇందులో నేను అనే క్యారెక్టర్ తోపాటు నువ్వు అనే క్యారెక్టర్ ను చూపించారు. ఈ రోజు గురించే ఆలోచించు ఫ్యూచర్ గురించి వచ్చే ఆలోచలను పక్కన పెట్టేసెయ్ అనే థీమ్ ను ఇందులో చెప్పాడు. అంటే ఉపేంద్రలో మనిషి అహం ను విడిచిపెట్టాలని చెప్పిన ఉపేంద్ర కథ చివర్లో ఏం చెప్పాలనుకున్నాడో దాని గురించి సరైన ఎండింగ్ ఇవ్వలేదు. క్లయిమాక్స్ పార్ట్ లో హీరోను మూడు షేడ్స్ లో చూపించాడు. నువ్వు అనే పాత్రను ఒక వైపు సాత్వికంగా చూపిస్తూనే మరోవైపు విలన్ లా ప్రజెంట్ చేశాడు. మరోవైపు అండర్ కవర్ పోలీస్ లా చూపేట్టే ప్రయత్నం చేశాడు. అసలు అలా ఎందుకలా చూపెట్టాడో కన్ క్లూజన్ ఇవ్వలేదు. అయితే నువ్వు షేడ్ లో ఉపేంద్ర అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే తన నటన వేరియషన్స్ చక్కగా చూపెట్టాడు. క్రిస్టినా అకిహివా తన పాత్ర న్యాయం చేసింది. షాయాజీ షిండే, పారుల్ యాదవ్, తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. గురుకిరణ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరావాలేదు. అశోక్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బావుంది.

విశ్లేషణ

ఉపేంద్ర` ఎండింగ్ లో నేను` అనేది ఒక భావన, దానికి ఇప్పుడు నువ్వు` అనే భావనకి మధ్య సంబంధం గురించి చెప్పాలనుకున్నా, మధ్యలో ఎక్కడో లింక్ తెగినట్టు కనపడింది. అలాగే క్యారెక్టర్స్ ను ఎక్కువగా, మిస్టరియస్ గా చూపాలనుకోవడం దానికి చివర్లో ముగింపు ఇస్తూ రావడం బాగానే ఉన్నా, నువ్వు గురించి చెప్పే అసలు కన్ క్లూజన్ అలాగే వదిలేశాడు. ఉపేంద్ర డైరెక్షన్ అంటేనే వెరైటీ. కథతో సంబంధం లేకుండా అలాంటి విలక్షణతను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

బాటమ్ లైన్: గజిబిజీ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను తికమక పెట్టే ఉపేంద్ర-2`

రేటింగ్: 2/5

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.