close
Choose your channels

'గురు' ట్రైలర్ రివ్యూ

Tuesday, March 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`బాబు బంగారం` త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా రూపొందిన చిత్రం `గురు`. హిందీలో సాలా ఖ‌ద్దూస్‌, త‌మిళంలో ఇరుదు సుట్రు అనే పేరుతో సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో వెంక‌టేష్ హీరోగా వైనాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై శ‌శికాంత్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుద‌ల కావ‌చ్చున‌ని స‌మాచారం. సినిమాలో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. వెంక‌టేష్ లుక్ ప‌రంగా చాలా కొత్త‌గా ఉన్నాడు.

వెంక‌టేష్ ఏజ్ ఫ్యాక్ట‌ర్‌కు త‌గిన విధంగా ఉన్న క్యారెక్ట‌ర్‌. బాక్సింగ్ కోచ్ పాత్ర‌. అత‌ని శిష్యురాలి పాత్ర‌లో రియ‌ల్ బాక్స‌ర్ రితిక సింగ్ న‌టించింది. ఓరిజిన‌ల్ హిందీ, త‌మిళ్ వెర్ష‌న్స్‌లో కూడా రితిక సింగ్ ఈ పాత్ర చేసింది. బాక్సింగ్ నేర్చుకోవాలంటే ఉండండి..లేదా దొబ్బేయండి..తేరగా బొక్క‌డానికి వ‌చ్చేవాళ్ళ‌కు నేర్పించే టైమ్ లేదు నాకు..అంటూ వెంక‌టేష్ డైలాగ్‌తో ప్రారంభ‌మ‌య్యే ఈ ట్రైల‌ర్‌లో ఈ రాక్ష‌సుడు చంపేస్తున్నాడే అంటూ శిష్యురాలు చెప్ప‌డం..ఊర‌కుక్క‌ను సింహాస‌నం మీద కూర్చొపెట్టినా దాని దృష్టంతా ఎప్పుడూ పెంట‌మీద‌నే ఉంటుంది అంటూ వెంకీ డైలాగ్‌..సినిమాలో ఎమోష‌న్స్‌, డ్రామాను సూచిస్తున్నాయి. వెంక‌టేష్ మేకోవ‌ర్, క‌మిట్‌మెంట్ క‌న‌ప‌డుతుంది. రితిక సింగ్‌కు ఈ పాత్ర చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..ఎందుకంటే అల్రెడి హిందీ, త‌మిళంలో చేసేసింది. సంతోష్ నారాయ‌ణ్ మ్యూజిక్‌లో వెంక‌టేష్ జింగిడి..పాట పాడ‌టం కొస‌మెరుపు. ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. శ‌క్తివేల్ సినిమాటోగ్ర‌ఫీతో ప్ర‌తి ఫ్రేమ్ రిచ్‌గా క‌న‌ప‌డుతుంది. ప్రూవ్‌డ్ మూవీ కాబ‌ట్టి ఆడియెన్ ఓ భ‌రోసాతో సినిమా థియేట‌ర్‌కు గ్యారంటీగా వ‌స్తాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.