close
Choose your channels

'డీజే దువ్వాడ జగన్నాథమ్' ను ఎందుకు చూడాలంటే

Wednesday, June 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎస్‌.హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`.శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా జూన్ 23న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తి నెల‌కొంది. బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా ఒక వైపు, మోడ్ర‌న్ లుక్‌లో మ‌రోవైపు బ‌న్ని లుక్ ఓ క్యూరియాసిటీని క‌లిగింది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే అస‌లు ఈ క్రేజీ సినిమాను ఎందుకు చూడాల‌నే విష‌యాల‌పై చిన్న లుక్కేద్దాంః

1 అల్లుఅర్జున్ః స్టైలిష్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఆడియెన్స్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. బ‌న్ని డ్యాన్సులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అల్రెడి విడుద‌లైన పాట‌ల ప్రోమోస్‌లో బ‌న్ని డ్యాన్స్ ఎలా ఉండ‌బోతుంద‌నేది సాంపిల్‌గా రుచి చూపించాడు. ఇక బ్రాహ్మ‌ణ యువ‌కుడి పాత్ర‌లో బ‌న్ని వేష‌ధార‌ణ‌, భాష ప‌లికిన తీరు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది. అస‌లు మీరేం మెసేజ్ ఇవ్వాల‌నుకుంటున్నారంటూ బ‌న్ని చెప్పిన డైలాగ్ ఇప్ప‌టికే ట్రెండ్‌గా మారింది. సినిమా థియేట‌ర్లో ప్రేక్ష‌కుడిని కూర్చొని పెట్టే కార‌ణాల్లో ముందు చెప్పుకొవాల్సింది బ‌న్నియే.

2.దిల్‌రాజుః నిర్మాత‌గా దిల్‌రాజు స‌క్సెస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొత్త‌, పాత అంటూ తేడా లేకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను నిర్మించాడు. ముందు క‌థ విష‌యంలో, మేకింగ్ విష‌యంలో దిల్ రాజు కాంప్ర‌మైజ్ కాడు. కాబ‌ట్టే ఇప్పుడున్న నిర్మాత‌ల్లో స‌క్సెస్‌ఫుల్ నిర్మాతగా మారాడు. గ‌తంలో అల్లు అర్జున్‌, దిల్ రాజు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య‌, ప‌రుగు చిత్రాలు రెండు సూప‌ర్‌హిట్సే కాబ‌ట్టి క‌చ్చితంగా హ్యాట్రిక్ కొట్టాల‌నే క‌సితో సినిమాను చేసుంటాడ‌న‌డంలో సందేహం లేదు.

హ‌రీష్ శంక‌ర్ః తొలి చిత్రంతో షాక్ తిన్న హ‌రీష్ శంక‌ర్ గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాడు. త‌ర్వాత రామ‌య్యా వ‌స్తావ‌య్యాతో ప్లాప్ మూట‌గ‌ట్టుకున్నాడు. చివ‌ర‌కు సుబ్రమ‌ణ్యం ఫ‌ర్ సేల్ తో హిట్ కొట్టాడు. ఇప్పుడు బ‌న్ని రూపంలో హ‌రీష్‌కు మ‌రో బ్ర‌హ్మాస్త్రం దొరికింద‌నే చెప్పాలి. హ‌రీష్ త‌న‌దైన స్ట‌యిల్‌లో సినిమాను ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌ను, ఎమోష‌న్స్‌ను జ‌త చేసి తెర‌కెక్కించాడు. ఈ సినిమా హిట్‌తో హ‌రీష్ మ‌రోసారి టాప్ డైరెక్ట‌ర్ రేసులో ముందు వ‌రుస‌లోకి రావ‌డం ఖాయం.

4.దేవిశ్రీ ప్ర‌సాద్ః బ‌న్ని, దేవిశ్రీ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు సినిమాలు రూపొందాయి. అన్ని సినిమాలు సూప‌ర్‌డూప‌ర్‌హిట్‌లే. ఇప్పుడు కూడా దేవిశ్రీ `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` కోసం ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించాడు. పాట‌ల‌న్నీ మార్కెట్లోకి దుమ్ము రేపుతున్నాయి. రేపు త‌న‌దైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ మెప్పించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అతృత‌గా ఎదురుచూస్తున్నారు.

5.పూజా హెగ్డేః హీరోయిన్‌గా పూజా హెగ్డే సినిమాకు మ‌రో ప్ల‌స్ అయ్యింది. గ్లామ‌ర్ ప‌రంగానే కాకుండా. పెర్ఫామెన్స్ ప‌రంగా పూజా హెగ్డే సినిమాలో మెప్పించ‌ద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

మొత్తం మీద క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌ఠైన‌ర్‌గా సినిమాలో బ‌న్ని అభిమానులు, మెగాభిమానులు, ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటున్నారో వాట‌న్నింటినితో వ‌డ్డించిన విస్త‌రిలా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.