close
Choose your channels

నాగ్ , వెంకీ..ఇద్దరికీ స్పెషలే

Wednesday, May 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది సీనియ‌ర్ టాప్ హీరోలు నాగార్జున‌, వెంక‌టేష్.. ఈ ఇద్ద‌రికీ ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ సంవ‌త్స‌రంతో వీరి కెరీర్ మొద‌లై మూడు ద‌శాబ్దాలు అంటే 30 ఏళ్లు పూర్తి కాబోతోంది మ‌రి. నాగార్జున విష‌యానికి వ‌స్తే.. అత‌ని తొలి చిత్రం 'విక్ర‌మ్' 1986లో మే 23న విడుద‌లై విజ‌యం సాధించింది. వి.మ‌ధుసూద‌న రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శోభ‌న హీరోయిన్ గా న‌టించింది.

ఇక వెంక‌టేష్ విష‌యానికి వ‌స్తే.. క‌థానాయ‌కుడిగా త‌ను న‌టించిన మొద‌టి సినిమా 'క‌లియుగ పాండ‌వులు' 1986లో ఆగ‌స్టు 14న రిలీజై హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఖుష్బూ హీరోయిన్ గా న‌టించింది. సో.. మొత్తానికి మూడు ద‌శాబ్దాల కెరీర్ పూర్త‌వుతున్నా ఇప్ప‌టికీ ఈ ఇద్ద‌రు హీరో పాత్ర‌ల‌తోనే కొన‌సాగుతుండ‌డం విశేష‌మే. ఈ ఇద్ద‌రి కెరీర్‌ల‌కి సంబంధించిన 30 ఏళ్ల సంబ‌రాల‌ను త్వ‌ర‌లోనే మ‌నం చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.