close
Choose your channels

2019 ఏపీ రౌండప్.. ప్రధాన ఘట్టాలివీ..

Tuesday, December 31, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2019 ఏపీ రౌండప్.. ప్రధాన ఘట్టాలివీ..

2019కు గుడ్ బై చెప్పేసి మరికొన్ని గంటల్లోనే కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో 2020కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి యూత్ అంతా సిద్ధమైపోయారు. మరోవైపు థర్టీ ఫస్ట్ నైట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే అసలు 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రధాన ఘట్టాలేవి..? 2019 ఎవరికి అచ్చొచ్చింది..? ఎవరూ ఢీలా పడ్డారు..? రాజకీయ పరంగా.. సామాజిక పరంగా ఏపీలో ఏమేం జరిగాయి..? అనే ఆసక్తికర విషయాలను సూటిగా సుత్తి లేకుండా మూడు ముక్కల్లో అందిస్తోంది.. మీ మా www.indiaglitz.com. ఇక ఆలస్యమెందుకు చకచకా చదివేయండి మరి.

రాజకీయపరంగా ఏమేం జరిగాయ్!

- వైఎస్ జగన్ 341 రోజులు.. 3,648 కిలోమీటర్ల ప్రజా సంకల్పయాత్ర ముగింపు
- హోరా-హోరీగా సార్వత్రిక ఎన్నికలు.. ఏప్రిల్-11న పోలింగ్.. మే-23న ఫలితాలు కనివినీ ఎరుగని రీతిలో 151 అసెంబ్లీ సీట్లతో వైసీపీ ఘన విజయం
- నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైస్ జగన్మోహన్‌రెడ్డి మే 30న ప్రమాణ స్వీకారం
- ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే అట్టర్ ప్లాప్ అవ్వడం.. ఆయన అడ్రస్ గల్లంతవ్వడం
- ఎన్నికల తర్వాత ఒక్కొక్కరుగా టీడీపీకి షాకివ్వడం.. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్ రావులు టీడీపీని వీడి బీజేపీకి జై కొట్టడం.
- టీడీపీని వెంటాడిన వరుస విషాదాలు.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం.

రాజధాని రచ్చరచ్చే..!

- అమరావతిలో లెజిస్లేచర్, కర్నూలులో జ్యుడిషయల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్స్ ఉండొచ్చని సంకేతాలు
అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులుండొచ్చేమోనని వైఎస్ జగన్ ప్రకటించడం.. దానిపై అమరావతికి చుట్టుపక్కలుండే గ్రామాల రైతులు, టీడీపీ నేతలు డిసెంబర్-19 నుంచి ఇప్పటికీ ఆందోళన చేపడుతుండటం. మంత్రులు ఎవరికి తోచిన ప్రకటనలు చేయడం.
- జీఎన్ రావు కమిటీ ఏర్పాటు.. తాజాగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) దీనిపై హైపవర్ కమిటీ ఏర్పాటు
- జనవరి-03న నివేదిక.. దాన్ని బట్టి సంక్రాంతి తర్వాత రాజధానులపై ఫైనల్ నిర్ణయం

మరిన్ని ముఖ్యాంశాలు..

2019 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు.. ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. కీలక నిర్ణయాలు, చట్టాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచినవి కూడా ఉన్నాయి.
- చరిత్రాత్మక చట్టం :- ఏపీ ప్రభుత్వం దిశ చట్టం 2019
- ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ :- పేదవారు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లు.
- ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా.. రూ.100 కోట్ల పైబడిన ప్రాజెక్టులు అన్నిటిని జ్యుడీషియల్ కమిటీ సమీక్ష
-50 శాతం పదవులు బడుగులకే.. :- రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు
- 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే :- దేశంలో సంచలనం రేకెత్తించింది ఈ బిల్లు. రాష్ట్రంలో కంపెనీలు పెట్టే వారు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం

శుభవార్తలు..

- ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది
- ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు మరో శుభవార్త. పాదయాత్ర హామీలో భాగంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ వైఎస్ జగన్ నిర్ణయం

జనరల్ విషయాలు..

- గోదావరి నదిలో బోటు బోల్తా పడింది.. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఇటీవల జరిగిన బోటు ప్రమాదం. ఈ ప్రమాదంలో 27 మందిని కాపాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో ఘటనలు జరిగాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.