close
Choose your channels

వెంకీ కోసం 4 టైటిల్స్...

Wednesday, December 2, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న ఈ చిత్రంలో అందాల తార న‌య‌న‌తార న‌టిస్తుంది. గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

డిసెంబ‌ర్ 16న ఈ చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి రాధాక్రిష్ణ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ రాధాక్రిష్ణ టైటిల్ ను ప‌క్క‌న పెట్టేసార‌ట‌. తాజాగా....బాబు బంగారం, డైమాండ్ రాజా, రాజా ర‌త్నం, 24 క్యారెట్ బంగారం...ఈ నాలుగు టైటిల్స్ ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఈ నాలుగింటిలో బాబు బంగారం, డైమాండ్ రాజా ఈ రెండు టైటిల్స్ లో ఒక‌టి ఫైన‌ల్ చేస్తార‌ట‌. త్వ‌ర‌లోనే టైటిల్ విష‌యంలో క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.