close
Choose your channels

రెండు గంట‌ల పాటు న‌వ్వించే స్టైలీష్ ఎంట‌ర్ టైన‌ర్ ఆటాడుకుందాం రా - సుశాంత్

Tuesday, August 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం ఆటాడుకుందాం...రా! జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. శ్రీనాగ్ కార్పోరేష‌న్ & శ్రీజి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్ పై చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ‌సుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఆటాడుకుందాం రా ఈనెల 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఈ సంద‌ర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ...ఇది ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ లేక‌పోతే క్లాసిక్ అని చెప్ప‌ను కానీ రెండు గంట‌ల పాటు ధియేట‌ర్ లో ప్రేక్ష‌కులు న‌వ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృధ్వీ, ర‌ఘుబాబు...వీళ్ల‌తో క‌లిసి న‌టిస్తూ చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంది. అడ్డా క‌న్నా బెట‌ర్ ఆల్భ‌మ్ ఇస్తాను అని చెప్పాడు. చెప్పిన‌ట్టుగానే అనూప్ మంచి ఆల్భ‌మ్ ఇచ్చాడు. శ్రీధ‌ర్ సీపాన క‌థ చెప్పిన వెంట‌నే న‌చ్చింది. అలాగే క‌థ చెప్పిన‌ప్పుడే చైత‌న్య గెస్ట్ గా చేస్తే బాగుంటుంది అనుకున్నాం. అయితే...ముందు షూటింగ్ చేసి అవుట్ పుట్ చూసుకుని బాగా వ‌చ్చింది అనుకుంటే చైత‌న్యని అడుగుదాం అనుకున్నాం. అవుట్ పుట్ సంతృప్తిక‌రంగా రావ‌డంతో చైత‌న్య‌ని అడిగాను. చైత‌న్య... నేను చేస్తే బాగుంటుందా అని అడిగాడు. బాగుంటుంది అని చెప్ప‌గానే ఓకే నేను చేస్తాను అన్నాడు.

ఇక అఖిల్ ని అయితే మా సిస్ట‌ర్ అడిగింది. అఖిల్ గెస్ట్ రోల్ చేస్తాడంటే నేను న‌మ్మ‌లేదు. కానీ...అఖిల్ ఎందుకు చేయ‌ను చేస్తాను అంటూ టైటిల్ సాంగ్ లో నాతో క‌లిసి డ్యాన్స్ చేసాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే... ఫ్యాన్స్ కి ఈ సినిమా పండ‌గే..! నిర్మాత చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు గారు ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి గారు చాలా క్లారిటీతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ మూవీలో కొత్త సుశాంత్ ని చూస్తారు. ఇక నుంచి సంవ‌త్స‌రానికి రెండు సినిమాలు చేస్తాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.