close
Choose your channels

మరోసారి పెద్ద మనసు చాటుకున్న సంపూ... చిన్నారి హార్ట్ సర్జరీకి చేయూత

Monday, February 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హృదయ కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సంపూర్ణేష్ బాబు. తనదైన పంచులు, మేనరిజంతో ఆయన వినోదాన్ని పంచుతున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే ఆపదలో వున్న వారికి తన వంతు సాయం చేస్తున్నారు సంపూ. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలలో గతంలో వరదలు వచ్చినప్పుడు సంపూ విరాళాలు అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వైద్య ఖర్చుల కోసం సాయం అందించారు సంపూర్ణేష్ బాబు.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా రామ‌న్న‌పేట గ్రామానికి చెందిన రెండు నెల‌ల బాలుడు గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సంపూర్ణేష్ బాబు.. బాలుడి స‌ర్జ‌రీ కోసం రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. శనివారం బాలుడి త‌ల్లిదండ్రులు ర‌మేశ్, లావ‌ణ్యకు స్వయంగా సంపూర్ణేశ్ బాబు డ‌బ్బుల‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మానేరు స్వచ్చంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్ పలువురు పాల్గొన్నారు

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీ ఫ్లవర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. వాసంతి హరోయిన్‌గా నటించింది. అయితే క్యాలీఫ్లవర్ జనాన్ని అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం పలువురు దర్శకులతో సంపూ కథా చర్చల్లో వున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.