close
Choose your channels

గ్రాండ్‌ గా కాజల్ అగర్వాల్ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్

Monday, February 21, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె సీమంతం వేడుక ఘనంగా జ‌రిగింది. త‌న భ‌ర్త‌ గౌతమ్ కిచ్లుతో పాటు కుటుంబస‌భ్యులు, బంధువుల‌తో కాజల్ దిగిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. త్వరలోనే కాజ‌ల్ తొలి బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌నుంది.

2007లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. అయితే కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చందమామ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. 2009లో వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో.. ఒక్కసారిగా టాప్ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది కాజల్. ఆ తర్వాత ఆమె నటించిన ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, నా పేరు శివ, బిజినెస్ మెన్, టెంపర్, నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి ఆమెకు స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టాయి.

తెలుగుతో పాటు దక్షిణాదిలోని అగ్రహీరోలందరితో నటించిన కాజల్.. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని 2020 అక్టోబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పకుండా.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటించారు కాజల్. అగ్రకథానాయకుడు చిరంజీవితో ఆమె నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘‘ఉమ’’ అనే బాలీవుడ్ సినిమాలోనూ నటించింది. ఈ మూవీ విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఇందులో తానొక మిస్టీరియ‌స్ అమ్మాయి పాత్ర‌లో క‌నిపిస్తానని అభిమానులకు కాజల్ తెలియజేశారు. అలాగే, హే సినామిక సినిమాలోనూ దుల్కర్ సల్మాన్ సరసన కాజ‌ల్ న‌టించింది. ఈ సినిమా వ‌చ్చేనెల 3న విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.