close
Choose your channels

అప్పుడు 'క్ష‌ణం'... ఇప్పుడు 'కృష్ణ అండ్ హిస్ లీల‌'

Monday, August 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అప్పుడు క్ష‌ణం... ఇప్పుడు కృష్ణ అండ్ హిస్ లీల‌

`క్ష‌ణం` సినిమా పేరు చెప్ప‌గానే చాలా మందికి అడివి శేష్ పేరూ, అన‌సూయ పేరూ గుర్తుకొస్తుంది. ఆ త‌ర్వాతే ఆదా శ‌ర్మ గుర్తుకొస్తుంది. ఆఖ‌రిగా గుర్తుకొచ్చే పేరు ఆ సినిమా ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ పేరెపు. బిగుతైన స్క్రీన్‌ప్లేతో ర‌వికాంత్ పేరెపు తెర‌కెక్కించిన సినిమా`క్ష‌ణం`. ఆ చిత్రం త‌ర్వాత ర‌వికాంత్ పేరెపు నెక్స్ట సినిమా స్టార్ట్ చేశాడు కానీ, చాన్నాళ్లు ప‌ట్టింది షూటింగ్ కు. ఆ తాజా సినిమా గురించి ర‌వికాంత్ పేరెపు చెప్పుకొచ్చారు. ``నా తాజా సినిమాప ఏరు కృష్ణ అండ్ హిస్ లీలా. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్న‌లగ‌డ్డ హీరో. `ర‌న్ రాజా ర‌న్‌` ఫేమ్ సీర‌త్ క‌పూర్ నాయిక‌గా న‌టించింది. ఇటీవ‌ల మా సినిమాలోని లాస్ట్ షాట్‌ను చిత్రీక‌రించాం. ల‌డ‌ఖ్‌లో చిత్ర క్రూ మొత్తం క‌లిసి చేసిన షాట్ అది. దాదాపు స‌ముద్ర‌మ‌ట్టానికి 17,582 అడుగుల ఎత్తులో మా ఫైన‌ల్ షాట్ పూర్తి చేశాం.

ల‌డ‌ఖ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇప్పుడున్న టెన్ష‌న్ గురించి నేను ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ చెప్ప‌క్క‌ర్లేదు. అయినా స్థానికులు చాలా మ‌ర్యాద‌గా మాతో ప్ర‌వ‌ర్తించారు. ఎంతో సుహృద్భావంతో మెలిగారు. వారి స‌హ‌కారాన్ని మ‌ర్చిపోలేను. ప్ర‌తిసినిమాకూ త‌న‌దైన ప్ర‌యాణం ఉంటుంది. ఈ సినిమా ప్ర‌యాణం నా గుండెల్లో నిలిచిపోతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాం`` అని అన్నారు. `క్ష‌ణం` త‌ర్వాత ఆ చిత్ర ద‌ర్శ‌కుడు రెండు సినిమాలు పూర్తి చేశారు. అందులో ఒక‌టి గూఢ‌చారి, ఇంకొక‌టి మొన్న విడుద‌లైన ఎవ‌రు. కానీ ద‌ర్శ‌కుడు మాత్రం రెండో సినిమాలోనే ఉన్నారు. ఈ కృష్ణ అండ్ హిస్ లీల ఆయ‌న కెరీర్‌కు ఎలాంటి సినిమా అవుతుంది? అస‌లు తెలుగు సినిమాకు ఇంగ్లిష్ టైటిల్ ఎందుకు పెట్టిన‌ట్టు? వ‌ంటివ‌న్నీ ప్ర‌మోష‌న్ ఈవెంట్స్ లో చెబుతార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.