close
Choose your channels

 "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" సినిమా ప్రారంభం!

Sunday, July 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

 ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ప్రారంభం!

"మళ్ళీరావా" సినిమా తరువాత నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న రెండో చిత్రానికి "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. మళ్ళీరావా దర్శకులు గౌతమ్ తిన్ననూరి తొలి షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర యూనిట్. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించబడుతున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

స్వరూప్ ఆర్.ఎస్.జే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతోందని నిర్మాత రాహుల్ దేవ్ నక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్క్ క్రోబిన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

 ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ప్రారంభం!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.